Saturday, February 8, 2020

A story in Mahabharat

మహాభారతం లో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి 
జూదం 
ద్రౌపది వస్త్రాభరణం 
కురుక్షేత్ర యుద్ధం వీటినే చూపెడతారు నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన నీతికథలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి ఇది 

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని  పేరు 

తనకంటే ఎక్కువ ధానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని ధర్మరాజు అభిప్రాయం  ఇదే ఆయనకు  అహంకారంగా  మారకూడదని  కృష్ణుడికి అనిపించింది  
అందుకోసం  కృష్ణుడు  ధర్మరాజుని  వేరే  రాజ్యానికి తీసుకు  వెళ్ళాడు 
ఆ రాజ్యాన్ని మహాబాల చక్రవర్తి  పాలిస్తూ  వచ్చారు  అక్కడ ఒకరి ఇంట్లోకి  వెళ్లి నీళ్లు అడిగారు ఆ ఇంటిలోని  ఆమె వారికి బంగారు  గ్లాసులో  నీళ్లు ఇచ్చింది  వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది  
ధర్మరాజు ఆమెతో  ఏంటమ్మా   బంగారాన్ని దాచుకోవాలి  కానీ ఇలా వీధిలో పడేస్తే  ఎలా అని చెప్పడంతో 
   ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన  వస్తువును  మళ్ళీ వాడము  అని బదులు చెప్పి వెళ్ళిపోయింది 
ఆ రాజ్యపు  సంపదను  గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు  ధర్మరాజు
ఇక రాజును  కలవడానికి  ఇద్దరు వెళ్లారు 

కృష్ణుడు మహాబలరాజు  తో ధర్మరాజును  ఈ విధంగా పరిచయం చేసాడు 
రాజా! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు  

కృష్ణా  మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా  పని ఉన్నదీ 
అందరి దగ్గర సంపద  బాగా ఉన్నదీ 
నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం ఇక్కడ బిక్షం  తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందువల్ల దానధర్మాలకు  ఇక్కడ స్థలం లేదు 
 ఇక్కడ ఎవరికీ ధానాలు తీసుకోవాల్సిన  అవసరం లేదు
ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు  
అందుకే అందరూ ధానాలు అడుగుతూ వస్తున్నారేమో 
ఈయన రాజ్యంలో అంతమందిని   పేదవారిగా ఉంచినందుకు  ఈ రాజు మొఖం చూడాలంటె  నేను సిగ్గుపడుతున్నాను  అన్నారు 

తన రాజ్యస్థితిని  తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు 
సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం  
ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా  మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా  వివరించారు
 మరి మన పాలకులు  ఎప్పుడు తెలుసుకుంటారో  ప్రజలు ఎప్పుడు మారుతారో.....

Saturday, February 1, 2020

తెనాలి రామకృష్ణ కధలు - Tenali Rama Krishna Stories in Telugu

500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.
ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు.

“నా దెగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు.
శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు.
వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయులు ప్రోత్సహించారు.
“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు.”
రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ.
“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.
రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు.

Wednesday, January 29, 2020

Tenali Rama Krishna

Tenali Rama was a Telugu poet and advisor in the court of King Krishnadevaraya, in what is now known as Andhra Pradesh. He was also known as the court jester because of his witty and humorous stories. Tenali Rama had a penchant for solving issues using his intelligence and values, and hence, his stories make for great bedtime stories for kids.
These mythological stories have been passed down since the early 16th century. More recently they’ve seen a revival which is all thanks to the animated series by Cartoon Network (India) called ‘The Adventures of Tenali Raman.’ The success of the show and his stories led to spin-offs like the animated series Rajguru Aur Tenaliram which was aired on Star Utsav and is now available on YouTube.
Nothing can beat the charm of reading these stories, which is why we wanted to shortlist our favourite Tanali Raman short stories for you. If your kids love problem-solving moral stories, then they’re going to enjoy listening to these Tenali Raman stories in English.

A story in Mahabharat

మహాభారతం లో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి  జూదం  ద్రౌపది వస్త్రాభరణం  కురుక్షేత్ర యుద్ధం వీటినే చూపెడతారు నిజానికి ఇప్పటి ఈ సమా...